News February 22, 2025

మతిమరుపునకు కారణం మీ నోరే: కొత్త స్టడీ

image

మతిమరుపు, చిగుళ్ల వ్యాధికి లింక్ ఉందంటున్నారు లూయిస్‌విల్లా మైక్రోబయాలజిస్ట్, Sr ఆథర్ జాన్ పొటెంపా. చిగుళ్ల రోగానికి కారణమయ్యే జింజివాలిస్ బ్యాక్టీరియానే నోటి నుంచి మెదడులోకి ప్రవేశిస్తున్నట్టు ఆయన గుర్తించారు. అక్కడ అది ఇన్‌ఫ్లమేషన్ పెంచి, అల్జీమర్స్‌తో సంబంధమున్న అమిలాయిడ్ ఫలకాలను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. వీటికి తోడు మరికొన్ని కారకాలు తోడవ్వడంతో అల్జీమర్స్ ముదురుతోందని చెప్తున్నారు.

Similar News

News February 22, 2025

భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే?

image

ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్-Aలోని భారత్-పాక్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఓడితే టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇప్పటికే కివీస్ చేతిలో పాక్ ఓడిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్‌తో మార్చి 2న జరిగే మ్యాచ్ మనకు కీలకమవుతుంది. టాప్-2లో ఉండే జట్లు మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్‌-Aలో కివీస్, భారత్ టాప్-2లో ఉన్నాయి.

News February 22, 2025

అక్కడ ప్రజలందరికీ నీలి కళ్లే!

image

సాధారణంగా అధిక శాతం మంది ప్రజల కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజలు నీలి కళ్లను కలిగి ఉంటారు. వార్డెన్‌బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల ఇలా కళ్లు రంగు మారిపోయాయి. పిండం అభివృద్ధి సమయంలోనే ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా, చాలా మంది మోడల్స్ లెన్స్ ద్వారా నీలి కళ్లుగా మార్చుకుంటుంటారు.

News February 22, 2025

‘తమన్నా’ లుక్స్ అదిరిపోయాయిగా..!

image

మిల్కీ బ్యూటీ తమన్నా ‘ఓదెల2’ మూవీలో డిఫరెంట్ గెటప్‌తో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ అమ్మడు అఘోరి పాత్రలో కనిపించి అందరినీ భయపడేలా చేశారు. <<15542277>>టీజర్‌లో<<>> శివశక్తి అవతారంలో అదరగొట్టారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్, విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. టీజర్ ఎలా ఉందో కామెంట్ చేయండి?

error: Content is protected !!