News February 7, 2025

మోనాలిసా లక్కంటే నీదేనేమో….!

image

మోనాలిసా… కుంభమేళాలో తన ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం ‘డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో నటిస్తోంది. దీనికి రెమ్యునరేషన్‌గా రూ.21లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలతో డీల్ చేసుకుందట. పూసలమ్మి రోజుకు రూ.1000 సంపాదిస్తే చాలనుకున్న మోనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్‌ వచ్చేసింది. లక్కంటే ఇదేనేమో మీరేమంటారు.

Similar News

News March 19, 2026

అమెరికాలోకి డ్రోన్లు.. హై అలర్ట్‌లో వాషింగ్టన్!

image

ఇరాన్‌తో ఉద్రిక్తతల వేళ వాషింగ్టన్‌లోని ఫోర్ట్ మెక్‌నాయర్ మిలిటరీ బేస్‌పై గుర్తుతెలియని డ్రోన్లు తిరగడం కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోనే US విదేశాంగ మంత్రి రూబియో, రక్షణ మంత్రి హెగ్‌సెత్ నివాసాలు ఉండటంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. గత 10 రోజులుగా ఇక్కడ డ్రోన్ల కదలికలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

News March 19, 2026

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ&రేటింగ్

image

అవినీతి నాయకులు, వారికి సాయపడే టెర్రరిస్టులను హీరో ఎలా ఎదుర్కొన్నారనేదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టోరీ. మేనరిజమ్స్, డాన్సులు, నటనతో పవన్ వన్‌మ్యాన్ షో చేశారు. చిరు-పవన్ పాత సాంగ్స్ ఆకట్టుకుంటాయి. శ్రీలీల నటన బాగుంది. ఫ్యాన్స్ కోసం మాస్ ఎలివేషన్స్, డైలాగులతో డైరెక్టర్ హరీశ్ శంకర్ కథను నడిపించారు. ఔట్‌డేటెడ్ స్టోరీ, కొన్ని లాజిక్ లేని సీన్లు, BGM మైనస్. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
రేటింగ్: 2.5/5

News March 19, 2026

దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

image

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.