News March 17, 2025
నేటి నుంచి ‘యువ వికాసం’ దరఖాస్తులు షురూ

TG: ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ నేడు ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 5వరకూ అప్లికేషన్లు స్వీకరించనున్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ.లక్ష నుంచి 3లక్షల వరకూ రుణాలు అందించనున్నారు. ఇందులో 60-80% వరకు రాయితీ ఉంటుంది. రూ.6 వేల కోట్లతో 5లక్షల మంది యువతకు రుణాలిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దరఖాస్తుకు సైట్: tgobmms.cgg.gov.in
Similar News
News November 22, 2025
కొడంగల్: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఈనెల 24న అక్షయపాత్ర నేతృత్వంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజకు సీఎం కొడంగల్ వస్తున్నారు. నిరంతర విద్యుత్, అంబులెన్స్ సర్వీస్, వైద్య సౌకర్యాలు, శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, త్రాగునీరు, పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 22, 2025
నాన్న 50ఏళ్లు ఇండస్ట్రీని తన భుజాలపై మోశారు: విష్ణు

తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ’94 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమను 50 ఏళ్లు మా నాన్న తన భుజాలపై మోశారు. ఆయన అసాధారణ ప్రయాణాన్ని చూడగలిగినందుకు ఎంతో గర్వంగా ఉంది. 50 లెజెండరీ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు నాన్న’ అని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే.
News November 22, 2025
గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


