News March 17, 2024

గాంధారిలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 30, 2026

NZB: నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించం: కలెక్టర్

image

విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్ల ఆర్‌సీఓలు, నిర్వాహకులతో మాట్లాడారు. విద్యార్థులతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ, తమ సొంత బిడ్డలుగా వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు.

News January 30, 2026

NZB: నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

image

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 13, 14, 15 డివిజన్ల నామినేషన్ల స్వీకరణ కేంద్రంతో పాటు అర్సపల్లి వాటర్ ట్యాంక్ జోన్ ఆఫీసు‌లో ఉన్న కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా లేదా అని ఆరా తీశారు.

News January 30, 2026

బోధన్: బీజేపీ అభ్యర్థిగా ఆసియా బేగం నామినేషన్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల్లో మూడో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం పట్టణంలోని గోశాల 27వ వార్డు నుంచి మైనారిటీ మహిళ ఆసియా బేగం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.