News August 7, 2024
యువత, ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలి: పవన్ కళ్యాణ్
AP: కొన్నేళ్ల క్రితం తాను చెప్పినట్లుగా చేనేత వస్త్రాలే <<13799309>>ధరిస్తున్నట్లు <<>>డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. ఈ రంగంపై జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆ రంగానికి అండగా ఉంటాం. యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే.. నేతన్నలకు ధీమా కలుగుతుంది’ అని పవన్ వెల్లడించారు.
Similar News
News January 15, 2025
సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?
ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?
News January 15, 2025
ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్‌కు BIG షాక్
నామినేషన్లకు ముందు ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్! లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు EDకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధులను విచారించే ముందు ED అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు నవంబర్లో సూచించిన సంగతి తెలిసిందే. కాగా తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీ ఆరోపిస్తున్నారు.
News January 15, 2025
24 గంటల్లో Rs1.87 లక్షలు పెరిగిన BITCOIN
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో అదరగొట్టాయి. మార్కెట్ విలువ 2.93% ఎగిసి $3.37Tకి చేరుకుంది. 57% మార్కెట్ డామినెన్స్ ఉన్న బిట్‌కాయిన్ $94,836 నుంచి 2.43% పెరిగి $97,043 వద్ద ట్రేడవుతోంది. అంటే $2207 (Rs1.87L) లాభపడింది. ఎథీరియం సైతం 2.81% ఎగిసి $3226 వద్ద చలిస్తోంది. XRP ఏకంగా 9.69% పెరిగి $2.79కు చేరుకుంది. BNB 1.54, SOL 2.75, DOGE 5.51, ADA 7.63, AVAX 4.18, XLM 7.81% మేర పెరిగాయి.