News March 17, 2024
బీజేపీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలి: డీకే అరుణ

మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది యువకులు ఆదివారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్టీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని సూచించారు. ఈ దేశం యువత భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు.
Similar News
News February 1, 2026
MBNR: ఆపరేషన్ స్మైల్–XII.. 83 మంది విముక్తి

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమంలో భాగంగా.. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మొత్తం 83 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం, వీరిలో 7 మంది బాలికలు,76 మంది బాలురు ఉన్నారని వెల్లడించారు.
News February 1, 2026
ముస్తాబైన మన్యంకొండ.. ఈ రోజే తేరు

మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువై తెలంగాణ తిరుపతిగా పేరొందిన మన్యంకొండ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు తేరు కావడంతో చుట్టూ ప్రక్క గ్రామాల భక్తులు ఇతర జిల్లాల నుంచి చాలా మంది మన్యంకొండకు తరలివస్తున్నారు. కొండ పైన స్నానానికి కోనేరు, ఉచిత దర్శనం, భోజనం, మరుగుదొడ్లు, పోలీస్ ఆరోగ్య సిబ్బంది,108 వాహనాల సౌకర్యం కూడా కల్పించారు. మరి మీరు కూడా వస్తున్నారా కామెంట్ చేయండి.
News February 1, 2026
పాలమూరు కాంగ్రెస్‌లో వర్గ పోరు

పాలమూరు మున్సిపాలిటీ ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు ద్వేషం అనే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. 60 డివిజన్లకు కాంగ్రెస్ ఆశావహులు 328 మంది నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో పార్టీ నేతలు టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయిందని తెలిసింది.


