News March 29, 2024
తెలంగాణలో యువ జనాభా తగ్గుతోంది

TG: రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా(19-29 ఏళ్లు) భారీగా తగ్గనుందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్-2024 వెల్లడించింది. 2021లో తెలంగాణలో 26.4 శాతం ఉన్న యువత సంఖ్య.. 2036 నాటికి 20.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న యువత 77.7 శాతం ఉండగా, నిరుద్యోగ రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి చేరినట్లు పేర్కొంది.
Similar News
News December 3, 2025
బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.
News December 3, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
News December 3, 2025
త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: రేవంత్

TG: 2023 DEC 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని CM రేవంత్ అన్నారు. ‘శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదేరోజు జరిగింది. ఆయన స్ఫూర్తితో 60వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మరో 40వేల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2001లో ఈ ప్రాంతం నుంచే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని 2004లో కరీంనగర్‌లో సోనియా ప్రత్యేక రాష్ట్రంపై మాటిచ్చారన్నారు.


