News September 10, 2024
భారత్లో అత్యధికంగా యువత ఆత్మహత్యలు

భారత్లో యువత ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో దాదాపు 40 శాతం మంది 30 ఏళ్లలోపువారే. ప్రపంచ సగటుతో పోలిస్తే యూత్ సూసైడ్స్ భారత్లో రెండింతలు ఎక్కువ. రోజుకు సగటున 160మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంచనా. ఆత్మహత్యలు పరిష్కారం కాదని తాత్కాలిక ఆగ్రహావేశాలతో నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని మానసిక నిపుణులు కోరుతున్నారు.
Similar News
News July 6, 2025
‘గోదావరి’ కోసం ఆ హీరోను సంప్రదించా: శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల అనగానే గుర్తొచ్చే సినిమాల్లో ‘గోదావరి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్రంలో ముందుగా హీరో రోల్ కోసం సిద్ధార్థ్ను సంప్రదించినట్లు దర్శకుడు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే హీరోయిన్ చుట్టూ సాగే కథ కావడంతో నో చెప్పారని వెల్లడించారు. మహేశ్ బాబును అనుకున్నా, ఆయనను కలవలేదన్నారు. ఫైనల్గా రామ్ పాత్రకు సుమంత్ను ఎంపిక చేశామని తెలిపారు. హీరోయిన్గా కమలిని గుర్తుండిపోయే పాత్ర చేశారు.
News July 6, 2025
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు ఎన్నంటే?

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్యను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మొత్తం 171 కాలేజీల్లో 1,07,218 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం సీట్లు ఉండగా 76,795 సీట్లను ఈ కోటాలో భర్తీ చేయనుంది. ఈ నెల 8తో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కానుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది.
News July 6, 2025
జింబాబ్వేతో మ్యాచ్.. ముల్డర్ డబుల్ సెంచరీ

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (264*) డబుల్ సెంచరీతో విజృంభించారు. 259 బంతులు ఎదుర్కొని 34 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకుని ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఆట తొలి రోజే ముల్డర్ డబుల్ సెంచరీ బాదడం విశేషం. కాగా ముల్డర్ ఐపీఎల్లో SRHకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే ఒక మ్యాచ్ ఆడి 9 రన్స్ చేశారు.