News January 11, 2026

YouTubeపై వియత్నాం కొత్త రూల్.. 5 సెకన్ల తర్వాత స్కిప్ ఉండాల్సిందే!

image

YouTube వీడియోలు చూడాలంటే యాడ్స్ చిరాకు తెప్పిస్తాయి. అయితే వియత్నాం ప్రభుత్వం యాడ్స్‌పై పరిమితులు విధిస్తూ చట్టం తీసుకువచ్చింది. ప్రతి వీడియోలో యాడ్ స్టార్ట్ అయిన 5 సెకన్లకు స్కిప్ ఆప్షన్ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో బలవంతంగా యాడ్స్ చూడాల్సిన బాధ తప్పుతుంది. ఇన్‌స్టా, టిక్‌టాక్‌కూ ఈ రూల్ వర్తించనుంది. FEB 15 నుంచి కొత్త విధానం అమలు కానుంది. మన దగ్గరా ఇలా చేయాల్సిందేనా? COMMENT?

Similar News

News February 16, 2026

శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

image

శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.

News February 16, 2026

28,740 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు

image

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు 5PM వరకు అప్లై చేసేందుకు అవకాశం ఉంది. APలో 1,060, TGలో 608 పోస్టులు ఉన్నాయి. టెన్త్ పాసై, 18-40 ఏళ్ల వయసున్న వారు అర్హులు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ ఉండదు. పోస్టును బట్టి రూ.10వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంది.
సైట్: https://indiapostgdsonline.gov.in/

News February 16, 2026

నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

image

AP: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నేడు అమరావతికి రానున్నారు. సచివాలయంలో CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరపనున్నారని సమాచారం. రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్, సంజీవని ప్రాజెక్ట్, టెక్నాలజీ ఆధారిత వ్యవసాయ విధానాలను ఆయన పరిశీలించనున్నారు.