News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
Similar News
News February 13, 2026
BIG BREAKING: నల్గొండ: మరో మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 9 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 1 వార్డు BRS గెలిచింది. మిగితా వాటిల్లో కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాగా ఇప్పటికే నందికొండ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
News February 13, 2026
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

TG: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 చోట్ల గెలిచారు. BRS ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే జిల్లాలోని హాలియాలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ పదింట్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. BRS రెండు వార్డుల్లో విజయం సాధించింది. చండూరు, చిట్యాల మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
News February 13, 2026
ఎరాస్మస్ బౌలింగ్ కరెక్టేనా?

T20WCలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విచిత్రమైన బౌలింగ్‌పై చర్చ మొదలైంది. ఇది గల్లీ త్రో బౌలింగ్‌లా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను అనుసరిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ICC 15 డిగ్రీల రూల్‌కు లోబడే అతని బౌలింగ్ ఉందని, మోచేయిని వంచడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా అతను(4W) భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.


