News February 18, 2025

అరెస్టు నుంచి యూట్యూబర్ రణ్‌వీర్‌కు రిలీఫ్

image

యూట్యూబర్ <<15499212>>రణ్‌వీర్<<>> అలహాబాదియ మాటలతో మన తల్లులు, ఆడపడుచులు, సమాజం తలదించుకుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే అరెస్టుల నుంచి రక్షణ కల్పించింది. ఇది ప్రజా కోర్టు కాదని, పౌరులు బెదిరించేందుకు, దోషిగా తేల్చేందుకు వీల్లేదని తెలిపింది. స్థానిక పోలీసుల వద్ద రక్షణ పొందొచ్చని సూచించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని, పాస్‌పోర్టును ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇంకెక్కడా FIR నమోదు చేయొద్దంది.

Similar News

News November 10, 2025

హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

image

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.

News November 10, 2025

నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.

News November 10, 2025

600 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు NOV 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: www.rites.com/Career. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.