News October 22, 2024

బాబు బొడ్డుతాడు కట్ చేసిన యూట్యూబర్.. కేసు నమోదు

image

వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇర్ఫాన్ అనే వ్యక్తి తన భార్య డెలివరీ జరుగుతుండగా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లి బాబు బొడ్డుతాడును కట్ చేశాడు. దీన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా వైరలైంది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌మెంట్ సీరియస్ అయ్యింది. సదరు వ్యక్తి, డాక్టర్, ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు పెట్టింది.

Similar News

News January 3, 2025

సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్‌ కీలకం?

image

సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్‌ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

News January 3, 2025

సైబర్ ట్రక్ వల్లే పేలుడు తీవ్రత తగ్గింది: పోలీసులు

image

లాస్‌ వెగాస్‌లోని ట్రంప్ హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన పేలుడు తీవ్ర‌త‌ సైబ‌ర్‌ట్ర‌క్ కారు వ‌ల్ల‌ త‌గ్గింద‌ని పోలీసులు తెలిపారు. కారు స్ట్రక్చరల్ డిజైన్ వ‌ల్ల పేలుడు తీవ్ర‌త‌ పైకి ఎగ‌సిప‌డ‌డంతో దాని ప్రభావం త‌గ్గింద‌న్నారు. హోటల్ ముందు ఉన్న అద్దాలు ప‌గ‌ల‌క‌పోవ‌డమే దానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. నిందితుడిని ప‌ట్టుకోవ‌డంలో స‌ర్వేలైన్స్ ఫుటేజీని అందించి ఎలాన్ మస్క్ సాయం చేశార‌ని పోలీసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

News January 3, 2025

నిద్ర పోతున్నప్పుడు ఫోన్ ఎక్కడ ఉంచాలంటే?

image

చాలామంది రాత్రి నిద్రపోయేముందు తమ ఫోన్‌ను దిండు కింద, చేయి దగ్గర ఉంచి నిద్రిస్తారు. కానీ ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రించడానికి 2 లేదా 3 గంటల ముందు ఫోన్‌ను మరో రూమ్‌లో పెట్టి పడకగదిలోకి వెళ్లాలి. మధ్యలో టైమ్, అలారమ్ కోసం కావాలనుకుంటే ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. ఆ సమయంలోనూ కొన్ని అడుగుల దూరంలో పెట్టాలి. పడకమీద ఫోన్ చూడకూడదని మీరే గట్టిగా నిశ్చయించుకోవాలి.