News July 9, 2025
యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈనెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, రీయూజ్డ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. AI వీడియోలు, కాపీపేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డీమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలని పేర్కొంది.
Similar News
News July 9, 2025
జూన్‌లో SIPs ఇన్వెస్ట్‌మెంట్స్ రికార్డు

జూన్ నెలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్(SIPs)లో పెట్టుబడులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మేలో రూ.26,688 కోట్ల ఇన్‌ఫ్లో ఉండగా జూన్‌లో రూ.27,269 కోట్లు వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తెలిపింది. మొత్తం SIP అకౌంట్లు 90.6 మిలియన్ల నుంచి 91.9 మిలియన్లకు పెరిగాయని వెల్లడించింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అసెట్స్ జూన్‌లో రూ.74 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.
News July 9, 2025
క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. * రూ.672 కోట్ల ధాన్యం బకాయిల విడుదలకు అంగీకారం * హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం * అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు నిర్ణయం * కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు అనుమతి * నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదం
News July 9, 2025
HCA, SRH మధ్య వివాదం ఏంటంటే?

IPL-2025 సందర్భంగా HCA, SRH మధ్య టికెట్ల వివాదం తలెత్తింది. రెగ్యులర్‌గా HCAకు 10% టికెట్లు ఫ్రీగా ఇస్తుండగా తనకు వ్యక్తిగతంగా మరో 10% టికెట్లు కావాలని HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ డిమాండ్ చేసినట్లు SRH ఆరోపించింది. అందుకు ఒప్పుకోకపోవడంతో LSGతో మ్యాచ్ సందర్భంగా VIP గ్యాలరీలకు తాళం వేసి జగన్మోహన్ వేధించారని ఫిర్యాదు చేసింది. విజిలెన్స్ విచారణలో ఇది నిజమని తేలడంతో జగన్మోహన్‌ను CID <<17008940>>అరెస్ట్<<>> చేసింది.