News December 24, 2024

పుష్ప-2 రికార్డులను YRF బద్దలుకొట్టాలి: అల్లు అర్జున్

image

కలెక్షన్లలో అదరగొడుతున్న పుష్ప-2 టీమ్‌కు యశ్‌ రాజ్ ఫిల్మ్స్(YRF) కంగ్రాట్స్ చెప్పింది. ‘రికార్డులున్నది బద్దలవడానికే. మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడతాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్న పుష్ప-2 చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు’ అని పేర్కొంది. దీంతో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రికార్డును YRF బద్దలుకొడుతుందని ఆశిస్తున్నానన్నారు.

Similar News

News December 24, 2024

పెండింగ్ ఛలాన్లపై డిస్కౌంట్.. పోలీసులు ఏమన్నారంటే?

image

వాహనదారులకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారని, వాహనాలపై ఉన్న పెండింగ్‌ ఛలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ఇచ్చారనే మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వరకు బైక్ ఫైన్లపై 80%, కార్లపై 60% డిస్కౌంట్‌తో చెల్లించాలని మెసేజ్‌లో ఉంది. వాహనదారులు దీనిని నమ్ముతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ ప్రకటన ఫేక్ అని, దీనిని నమ్మొద్దని సూచించారు.

News December 24, 2024

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు

image

AP: సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ-1గా సంజయ్, ఏ-2గా సౌత్రికా టెక్నాలజీస్, ఏ-3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను చేర్చింది. కాగా గతంలో సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సంజయ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

News December 24, 2024

OYO బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్

image

ప్రముఖ హోటల్ బుకింగ్ యాప్ ‘OYO’ ఈ ఏడాది ‘ట్రావెలోపీడియా-2024’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అత్యధికంగా బుకింగ్స్ చేసిన నగరంగా నిలిచింది. దీని తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఇక పూరీ, వారణాసి, హరిద్వార్ నగరాలు ఎక్కువగా ప్రయాణించే ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక మొత్తంలో బుకింగ్స్ అయ్యాయి.