News October 31, 2024

YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

image

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YS) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YS ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈదోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. ఆయన అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ల ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనవిగా ఎలా మారాయి’ అని ప్రశ్నించారు.

Similar News

News October 31, 2024

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పోలీసుల నివాళి

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాపోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.

News October 30, 2024

ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి?

image

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడియం ఆదిలక్ష్మి(42), మల్లవరపు సుబ్బారెడ్డి (55) బర్రెలను మేపడానికి పొలం వెళ్లారు. బర్రెలు నీటిలోకి వెళ్లాయని మూసీ నది దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆదిలక్ష్మి మృతదేహం బుధవారం లభించగా.. గల్లంతైన సుబ్బారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News October 30, 2024

ప్రకాశం జిల్లాలో మొత్తం ఓటర్లు ఎంతమందంటే.!

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తాజాగా అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 18,19,566 చేరింది. ఇందులో పురుషుల సంఖ్య 9,06,234 కాగా, మహిళా ఓటర్లు 9,13,218 మంది ఉన్నారు. వీరిలో థర్డ్ జండర్ 114 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే 6,984 మహిళా ఓటర్లే అధికం. జనవరి 6న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.