News October 31, 2024
YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
ఆస్తుల గొడవలతో పెద్దాయన(YS) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YS ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈదోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. ఆయన అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ల ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనవిగా ఎలా మారాయి’ అని ప్రశ్నించారు.
Similar News
News November 22, 2024
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం ఎస్పీ
పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను గుర్తించడంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం ఎస్పీ దామోదర్ సూచించారు. ప్రజలు, విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పర్యవసనాలు, గుడ్, బ్యాడ్ టచ్, రోడ్డు ప్రమాదాల నివారణలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
News November 20, 2024
అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఊచలు లెక్కపెట్టక తప్పదని మంత్రి స్వామి అన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి ఘటనకు సంభందించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన గంటలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
News November 20, 2024
శాసనమండలిలో మంత్రి గొట్టిపాటి ఫైర్
శానసమండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుందన్నారు.అవగాహన, ముందు చూపు లేని సీఎం వల్ల విద్యుత్ శాఖలో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, పెరగనున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా అడుగులేస్తోందన్నారు.