News July 22, 2024

YS జగన్‌పై చింతమనేని ఫైర్

image

మాజీ సీఎం వైఎస్.జగన్‌పై దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్రంలో జరగని హత్యలను జరిగినట్లుగా ఆరోపిస్తున్నారని, సొంత చిన్ననాన్నను హత్య చేసిన వ్యక్తిని వెనకేసుకొని సాగుతా ఉన్నావ’ని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘నీకు అర్హత లేదని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశార’న్నారు.

Similar News

News December 1, 2025

మొగల్తూరు: ‘నేడు పేరుపాలెం బీచ్‌కు రావొద్దు’

image

తుఫాను హెచ్చరికలు, సముద్రంలో అలల ఉద్ధృతి కారణంగా జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పేరుపాలెం బీచ్‌కి సోమవారం సందర్శకులను అనుమతించబోమని మొగల్తూరు ఎస్ఐ జి.వాసు తెలిపారు. వాతావరణ మార్పులతో అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించాలన్నారు. బీచ్ సందర్శనకు రావొద్దని సూచించారు.

News December 1, 2025

భీమవరంలో నేడు యధావిధిగా PGRS.!

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.