News February 25, 2025
YS జగన్పై మంత్రి స్వామి హాట్ కామెంట్స్

30 ఏళ్లు అధికారం నాదేనంటూ విర్రవీగిన జగన్ని ప్రజలు ఐదేళ్లకే భరించలేక ఛీత్కరించినా.. మళ్ళీ మరో 30 ఏళ్లు అధికారం తమదేనని జగన్ కార్యకర్తలను మభ్యపెడుతున్నాడని మంత్రి స్వామి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేకపోయాడని ఎద్దేవా చేశారు. జగన్కి పదవులు మీద ఉన్న ఆరాటం ప్రజాసమస్యలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే తనపదవి రద్దవుతుందని వచ్చారన్నారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
News April 23, 2025
అలకూరపాడు జడ్పీ హై స్కూల్ విద్యార్థినికి 595 మార్కులు

టంగుటూరు మండలంలోని అలకూరపాడు జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 600 గాను 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచింది. ఈ సందర్భంగా బాలికను పాఠశాల ఉపాధ్యాయులు, మండల విద్యశాఖధికారులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
News April 23, 2025
10th RESULTS: 9వ స్థానంలో ప్రకాశం జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రకాశం జిల్లా 85.43%తో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. మొత్తం 29,386 మంది పరీక్షలు రాయగా 25,103 మంది పాసయ్యారు. 14,880 బాలురులో 12,480 మంది, 14,506 మంది బాలికలు పరీక్ష రాయగా 12,623 మంది పాసయ్యారు.