News December 15, 2024
YS రాజశేఖర్ రెడ్డి స్వగ్రామంలో టీడీపీ హవా.!

కడప జిల్లా సింహాద్రిపురం మండలం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం బలపనూరులో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలో TDP అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. బలపనూరు సాగునీటి సంఘం ఛైర్మన్గా వై వీరప్రతాప్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దశాబ్దాల తర్వాత ఇక్కడ టీడీపీ అధికారం చేపట్టడంతో సంబరాలు చేసుకున్నారు.
Similar News
News November 22, 2025
కడప: వీరికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు

కడప జిల్లాలోని ఇద్దరికి కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించింది. వీరిలో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్కు ఏపీ స్టేట్ షేక్/షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే కడపకు చెందిన యాతగిరి రాంప్రసాద్ను ఏపీ ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమించారు.
News November 22, 2025
YVUలో అతిథి ఫ్యాకల్టీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు

YVU కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు PHD/MTech (ఏదైనా కంప్యూటర్ స్ట్రీమ్)/ఎంసీఎ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం YVU అధికార వెబ్సైట్లో చూడవచ్చన్నారు.
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.


