News January 25, 2025
YS వివేకా ఘటనపై స్పందించిన విజయసాయిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యానని, వెంటనే అవినాశ్ రెడ్డికి ఫోన్ చేయగా పక్కన ఉన్న వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు నాకు చెప్పారని, ఫోన్లో వచ్చిన సమాచారమే మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది.
Similar News
News January 29, 2025
దేవుని కడప: శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. రేపు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలకనున్నారు.
News January 28, 2025
30న కమలాపురం పట్టణంలో మినీ జాబ్ మేళా
కమలాపురంలోని వెలుగు కార్యాలయంలో ఈనెల 30వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఏ. సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో ఎల్ఐసీలో బీమా సఖి, నవత ట్రాన్స్పోర్ట్లో క్లర్క్, డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, అనుభవంను బట్టి వేతనాలు ఉంటాయని తెలిపారు.
News January 28, 2025
పులివెందుల: అన్నను హత్య చేసిన తమ్ముడు అరెస్టు
అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కేసులో తమ్ముడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు.. 2024 సెప్టెంబర్ 13న పులివెందుల(M) రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని బాబయ్య, తమ్ముడు బాబా ఫక్రుద్దీన్తో గొడవపడి కోపంలో సమ్మెటతో బలంగా కొట్టి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం సోమవారం అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది.