News August 23, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్‌లైన్

image

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.

Similar News

News December 9, 2025

KNR: ‘ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి’

image

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కంసాని ఉదయ ప్రకృతి ప్రకాష్ నిర్మించిన “ఓటే భవితకు బాట” ఆడియో సీడీని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆవిష్కరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానమైనదని, ప్రజల చేతిలో ఆయుధమని అన్నారు.

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.