News September 18, 2024

బాధితులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం

image

AP: ప్రత్యర్థుల దాడిలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కాశీవారిపాకలకు చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేల సాయం అందించారు. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు వెళ్లగా, బాధితులు ఆయనకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారికి సాయం చేయడంతోపాటు లీగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు.

Similar News

News November 28, 2025

విశాఖ: రూ.కోట్లలో మోసానికి పాల్పడ్డ కానిస్టేబుల్!

image

విశాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం రేపింది. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రూ.3లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది పోలీసులు లాభాలు వస్తాయని నమ్మి మోసపోయినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

News November 28, 2025

4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

image

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్‌ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.

News November 28, 2025

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

image

అండాశయం (ఓవరీస్‌) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్‌ను ‘ఫెలోపియన్‌ ట్యూబ్స్‌’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్‌ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్‌), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.