News December 21, 2024

వైఎస్ జగన్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు

image

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారు. మీకు చక్కటి ఆరోగ్యం, సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థికి చంద్రబాబు విషెస్ చెప్పడంపై నెట్టింట వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

Similar News

News December 21, 2024

ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలా?: సీతక్క

image

TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.

News December 21, 2024

‘మిషన్ భగీరథ’ విఫలం.. నిరూపిస్తా లేదంటే రాజీనామా చేస్తా: జూపల్లి

image

కేటీఆర్ చేసిన సవాలుకు మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. 60శాతం గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అన్నారు. ‘నీళ్లు రావట్లేదన్న విషయాన్ని నేను 100శాతం నిరూపిస్తా. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తా. ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేకపోయారు. భూ సమీకరణకు కూడా డబ్బులివ్వలేదు’ అని మండిపడ్డారు.

News December 21, 2024

‘ఉచిత బస్సు‘పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం

image

AP: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.