News January 16, 2025
కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.
Similar News
News November 3, 2025
మల్లె తోటల్లో ఆకులు రాల్చడం.. దేని కోసం?

మల్లె తోటల్లో మంచి దిగుబడి కోసం.. నవంబర్ నుంచి చెట్లకు నీరు పెట్టకుండా ఆకులు రాలేటట్లు చేయాలి. అలాగే కొందరు రైతులు మల్లె తోటల్లో గొర్రెలను మంద కడతారు. దీని వల్ల గొర్రెలు ఆకులను తింటాయి. ఫలితంగా మొక్కలకు కొత్త చిగుర్లు వస్తాయి. అలాగే గొర్రెల ఎరువు వల్ల కూడా భూసారం పెరుగుతుంది. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి.
News November 3, 2025
రాబోయే 2 గంటల్లో వర్షం: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. ఈ సమయంలో 40-50kmph వేగంతో గాలులు వీస్తాయని, చెట్ల కింద నిల్చోవద్దని సూచించింది.
News November 3, 2025
శీతాకాలం అతిథుల రాక మొదలైంది: పవన్

AP: పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులైన ఫ్లెమింగ్ పక్షుల రాక మొదలైందని Dy.CM పవన్ అన్నారు. ‘ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్‌ను మారుస్తాం. ఫ్లెమింగోలు ఆహారం, విశ్రాంతి కోసం అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోతాయి. వాటికి ఇబ్బందులు కలగకుండా కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి 3 రోజుల పండుగతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని విస్తరిస్తాం’ అని పవన్ చెప్పారు.


