News October 1, 2024
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్, సతీమణి భారతి రెడ్డిలకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి వారు నేరుగా తాడేపల్లికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 8, 2025
అప్పట్లో చందర్‌పాల్.. ఇప్పుడు స్మిత్ ఎందుకంటే?

యాషెస్ 2వ టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ చేసే సమయంలో కళ్ల కింద నల్లటి స్టిక్కర్లు అంటించుకొని కనిపించారు. వాటిని యాంటీ గ్లేర్ స్ట్రిప్స్ అని అంటారు. కాంతి నేరుగా కళ్ల మీద పడకుండా అవి ఆపుతాయి. ముఖ్యంగా ఫ్లడ్ లైట్ల నుంచి వచ్చే కాంతిని కట్ చేసి బంతి స్పష్టంగా కనిపించేందుకు సాయపడతాయి. గతంలో వెస్టిండీస్ లెజండరీ బ్యాటర్ చందర్‌పాల్ కూడా ఇలాంటివి ధరించేవారు. మీకు తెలిస్తే COMMENT చేయండి.
News December 8, 2025
ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.
News December 8, 2025
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

☛ బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.


