News July 23, 2024
నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తినకు చేరుకుంటారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా.. రాష్ట్రంలోని ఎన్డీయే సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఆయన పాల్గొననున్నారు.
Similar News
News December 31, 2025
అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం ఇదే: సీఎం

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకుంటున్న వారికి సీఎం చంద్రబాబు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ‘కొత్త ఏడాది మీకు మంచి జరగాలని కోరుకుంటూ.. ఒక రోజు ముందుగానే పెన్షన్ సొమ్ము అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లపై రూ.50 వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాం. ఇది మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం అని తెలియజేస్తూ… అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
News December 31, 2025
రేపు పబ్లిక్ హాలిడే లేదు.. అయినా..

జనవరి 1 న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ప్రకటించలేదు. ఏపీ, తెలంగాణలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది. అయినా చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు రేపు సెలవు ప్రకటించాయి. దీనికి బదులు ఫిబ్రవరిలో రెండో శనివారం పాఠశాలలు పని చేస్తాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. అటు బ్యాంకులకు సైతం రేపు సెలవు లేదు. యథావిధిగా నడుస్తాయి.
News December 31, 2025
పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మరణాలు

APలో <<18469690>>స్క్రబ్ టైఫస్<<>> కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 2 వేలకుపైగా కేసులు నమోదు కాగా 22మంది మరణించారు. గత మూడేళ్లుగా చిత్తూరు(D)లో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది చిత్తూరులో అత్యధికంగా 491 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, విశాఖ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శరీరంపై నల్లమచ్చతోపాటు జ్వరం, తలనొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.


