News July 1, 2024

రేపు తాడేపల్లికి వైఎస్ జగన్?

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివాసానికి రానున్నట్లు సమాచారం. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. గత నెల 22న పులివెందులకు వెళ్లిన జగన్ 3 రోజులు ప్రజాదర్బార్ నిర్వహించారు. 24న సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే.

Similar News

News January 29, 2026

ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల

image

TG: ఇంటర్ పరీక్షలకు సంబంధించి సైన్స్, ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లను బోర్డు రిలీజ్ చేసింది. కాలేజ్ లాగిన్ ఐడీల్లో వాటిని పొందుపరిచినట్లు తెలిపింది. విద్యార్థులు హాల్ టికెట్ల కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌ను కలవాలని సూచించింది. హాల్ టికెట్స్‌లోని వివరాలను పరిశీలించి కాలేజ్, బోర్డు సూచనలు పాటించాలని కోరింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

News January 29, 2026

173 ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 173 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(CS) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 29, 2026

గర్భ నిరోధక ఇంజెక్షన్

image

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. వీటికి ప్రత్యామ్నాయంగా గర్భ నిరోధక ఇంజెక్షన్ తీసుకోవచ్చు. దీన్ని డీఎంపీఏ ఇంజెక్షన్ (డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్) వాడతారు. ఇందులో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. ఆ తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవచ్చు.