News February 14, 2025
నేడు కడప జిల్లాకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు ఓ కన్వెన్షన్‌లో జరగనున్న ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారని వైసీపీ కార్యాలయం పర్యటన వివరాలు వెల్లడించింది. అనంతరం ఆయన అక్కడి నుంచి బెంగళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 10, 2025
NEET PG ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

నీట్ పీజీ ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు ఈనెల 5తో ముగియగా తాజాగా MCC దాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చంది. సమాచారం కోసం వెబ్సైట్‌ను ఫాలో కావాలని సూచించింది. కాగా పరీక్ష పారదర్శకంగా ఉండడం లేదని, ఆన్సర్ కీ పబ్లిష్ చేయాలని ఇంతకు ముందు SCలో కేసు దాఖలైంది. కోచింగ్ సెంటర్లే ఇలా కేసులు వేయిస్తున్నాయని NBE వాదిస్తోంది. దీనిపై అఫిడవిట్ వేయాలని SC ఇటీవల ఆదేశించింది.
News November 10, 2025
CSK నుంచి జడేజా ఔట్?

రాజస్థాన్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్‌స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్‌ను నివారించడానికి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.
News November 10, 2025
ప్రచారం కోసం పిటిషన్లా? కేఏ పాల్‌పై సుప్రీం ఆగ్రహం

ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడాన్ని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇవాళ ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయనపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పిల్స్ దాఖలు చేస్తున్నారని మండిపడింది. PPP అంశంపై ఏపీ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.


