News March 17, 2025
రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.
Similar News
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.
News November 24, 2025
అనంతమైన పుణ్యాన్ని ఇచ్చే విష్ణు నామం

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః|
ఛన్దో నుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః||
విష్ణు సహస్ర నామాలకు రుషి ‘వేదవ్యాసుడు’. ఈ స్తోత్రం ఛందస్సు ‘అనుష్టుప్’. ఈ పారాయణంలో దేవకీ పుత్రుడైన కృష్ణుడిని ఆరాధిస్తాం. అయితే శ్లోకాలను పఠించే ముందు భక్తులు వివరాలు తెలుసుకోవాలి. విష్ణు నామాల మూలం, ఛందస్సు, ఆరాధ దైవం గురించి తెలుసుకొని మరింత సంకల్పంతో పఠిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 24, 2025
క్రీడాకారులకు ఆర్మీలో ఉద్యోగాలు

<


