News December 25, 2024

కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)

image

AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.

Similar News

News December 25, 2024

రేపటి టెస్టులో రోహిత్ ఓపెనింగ్!

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. యశస్వీతో కలిసి హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని, కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సుందర్ వస్తారని తెలుస్తోంది.

News December 25, 2024

ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం

image

TG: ఫార్ములా-ఈ రేస్ కేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ-రేస్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

News December 25, 2024

రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!

image

మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్‌గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్‌ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్‌కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.