News April 2, 2024
వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.
Similar News
News March 23, 2026
భారత్ సవాళ్లకు భయపడదు: ప్రధాని మోదీ

భారత్ సవాళ్లకు భయపడదని, వాటిని ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని రంగాలపై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. శాంతి చర్చలను భారత్ ఎప్పుడూ స్వాగతిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు సాగుతోంది’ అని TV9 సమ్మిట్‌లో పేర్కొన్నారు.
News March 23, 2026
షెడ్యూల్ ప్రకారమే IPL మ్యాచులు: అధికారి

ఈ నెల 28 నుంచి IPL షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని లీగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఫారిన్ ప్లేయర్లు పాల్గొంటారా లేదా అనేది ఫ్రాంచైజీలు చూసుకుంటాయని, ఆ నిర్ణయం వారిదేనని తెలిపారు. వర్క్‌లోడ్, గాయాల వల్ల కొందరు ఇంకా ఆయా జట్లలో చేరలేదని పేర్కొన్నారు. కాగా తమ దేశాల క్రికెట్ బోర్డుల నుంచి NOC రాలేదని స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు ఇంకా IPL <<19429037>>టీమ్‌లలో<<>> చేరని సంగతి తెలిసిందే.
News March 23, 2026
త్వరలో రష్యా పర్యటనకు మోదీ!

ప్రధాని మోదీ ఈ ఏడాది రష్యాలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇండియా, రష్యా మధ్య జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో లావ్రోవ్ మాట్లాడారు. రెండు దేశాలది కాల పరీక్షకు నిలిచిన స్నేహమని కొనియాడారు. గతేడాది డిసెంబర్‌లో రెండు రోజులపాటు ఇండియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ <<18475772>>పర్యటించడం<<>> తెలిసిందే.


