News January 7, 2025
YS జగన్ సమీప బంధువు మృతి
AP: YS జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్తో మూడు నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన HYD AIGలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. YS ప్రకాశ్ రెడ్డి మనవడు అయిన ఆయన జగన్కు సోదరుడి వరుస అవుతారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ విజయం కోసం ఆయన తీవ్రంగా పనిచేశారు. బెంగళూరులో స్కూలు విద్యాభ్యాసం, ఖమ్మం మమతా కాలేజీలో MBBS చదివారు.
Similar News
News January 8, 2025
విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.
News January 8, 2025
ఈ ప్రాజెక్టులతో సరికొత్త శిఖరాలకు ఏపీ: మోదీ
APలో ఇవాళ తాము శ్రీకారం చుట్టిన రూ.2.10లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. IT, టెక్నాలజీకి AP ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు. విశాఖకు కేటాయించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతో మందికి ఉపాధి ఇస్తుందని, 3 రాష్ట్రాల్లోనే వస్తున్న బల్క్ డ్రగ్ పార్కును విశాఖ(నక్కపల్లి)కి కేటాయించామన్నారు.
News January 8, 2025
ఏసీబీ కార్యాలయంలో ముగిసిన అరవింద్ కుమార్ విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేసుకున్నారు.