News February 24, 2025

YS జగన్ కీలక నిర్ణయం

image

AP: శాసనసభకు YCP అధినేత జగన్, ఆ పార్టీ MLAలు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. MLAలు, MLCలతో భేటీలో జగన్ ఈ విషయం వెల్లడించారు. మండలిలో బలం ఉన్నందున MLCలు హాజరుకావాలని ఆదేశించారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. మండలిలో సమస్యలను బలంగా ప్రస్తావించాలన్నారు. YCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 24, 2025

KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

image

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.

News February 24, 2025

త్వరలో నెస్లే ఇండియా ఉత్పత్తుల ధరలు పెంపు

image

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.

News February 24, 2025

ఏడాదిలో 300 రోజులు అదే తింటా: మోదీ

image

ఫూల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని, ఏడాదిలో 300 రోజులు అదే తింటానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారు. దీని ఉత్పత్తి ఇంకా పెరగాలి’ అని పేర్కొన్నారు. కాగా బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌లో ప్రకటించారు.

error: Content is protected !!