News April 1, 2025

తెలంగాణ కాంగ్రెస్ ఫ్లెక్సీలో YS జగన్ ఫొటో

image

TG: నల్గొండలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. సన్నబియ్యం పంపిణీకి వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలుకుతూ దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Similar News

News January 22, 2026

జగిత్యాల: తెలంగాణను దేశానికే దిక్సూచిగా మారుస్తాం: డిప్యూటీ సీఎం

image

ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ, రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిలా తీర్చిదిద్దడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

News January 22, 2026

ఖమ్మం: సోషల్ మీడియాపై పోలీసుల నజర్.. జర జాగ్రత్త..!

image

సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా సరే అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన రంగా ప్రవీణ్‌ను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయొద్దని ఉమ్మడి ఖమ్మం పోలీసులు సూచిస్తున్నారు.

News January 22, 2026

HEADLINES

image

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర