News September 21, 2024
గవర్నర్‌ను కలిసిన వైఎస్ షర్మిల

AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్‌ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.
Similar News
News November 20, 2025
స్పోర్ట్స్ రౌండప్

* ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. ఇవాళ చైనీస్ తైపీకి చెందిన గువాయి గ్జువాన్‌తో అమీతుమీ
* బధిర ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్)లో ఇప్పటివరకు 11 పతకాలు సాధించిన భారత షూటర్లు
* టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్-2026’కు ఎంపికైన దిగ్గజ ప్లేయర్ ఫెదరర్
* ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో రెండో రౌండ్లో లక్ష్య సేన్, ప్రణయ్
* ఝార్ఖండ్‌తో రంజీ మ్యాచులో ఆంధ్ర విజయం
News November 20, 2025
ఆగని పైరసీ.. కొత్తగా ‘ఐబొమ్మ వన్’

ఆన్లైన్లో మరో పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. కొత్తగా ‘ఐబొమ్మ వన్’ ప్రత్యక్షమైంది. అందులోనూ కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
News November 20, 2025
రైతులకు బాబు వెన్నుపోటు: YCP

AP: ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ విమర్శించింది. అన్నదాత సుఖీభవ పథకం తొలి రెండు విడతల్లో <<18329772>>7 లక్షల మంది<<>> లబ్ధిదారులను తొలగించారని ఆరోపించింది. వైసీపీ హయాంలో 53.58 లక్షల మందికి ఈ పథకం కింద డబ్బులు అందేవని వెల్లడించింది. అలాగే పంటలకు మద్దతు ధరలు కూడా ఇవ్వట్లేదని ట్వీట్ చేసింది.


