News June 19, 2024

రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళులు

image

AP: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా నివాళులర్పించారు. ఈరోజు ఆర్ఎఫ్‌సీకి చేరుకున్న ఆమె, ఆయన ఫొటోకు అంజలి ఘటించారు. ఆయన కుటుంబీకుల్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. గతంలో వైఎస్ కుటుంబం, రామోజీరావు మధ్య పలు విభేదాలుండేవన్న సంగతి తెలిసిందే.

Similar News

News March 28, 2026

ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదు: స్పీకర్

image

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ CM CBN అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదన్నారు. ‘శాశ్వత రాజధాని నిర్మాణానికి సీఎం సంకల్పించారు. ఆంధ్రుల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపం. 2019లో రాజధాని ప్రగతికి అడ్డంకులు ఎదురయ్యాయి. దాన్ని శాశ్వతంగా తొలగించే యజ్ఞమిది’ అని పేర్కొన్నారు.

News March 28, 2026

అంతరిక్షంలో పిల్లలు పుడతారా?

image

అంతరిక్షంలో పునరుత్పత్తిపై జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జీరో గ్రావిటీ వల్ల వీర్యకణాలు తమ దిశను కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వెళ్లినట్లుగా ఇవి సరైన మార్గంలో ప్రయాణించలేకపోవడంతో అంతరిక్షంలో సహజ గర్భధారణ కష్టమని తేలింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పరచుకోవాలన్న ఆలోచనకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారనుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి.

News March 28, 2026

Polyamory.. Tolyamory.. ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసా?

image

డేటింగ్ ప్రపంచంలో కొత్త పదాలు వినిపిస్తుంటాయి. పార్ట్‌నర్ పర్మిషన్‌తో అందరికీ తెలిసేలా ఒకే టైమ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో రిలేషన్ కొనసాగించడాన్ని ‘Polyamory’ అంటారు. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ముఖ్యం. మరోవైపు తన పార్ట్‌నర్‌కు బయట వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని ‘Tolyamory’ అంటారు. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ మౌన అంగీకారానికి ఈ కొత్త పేరు వచ్చి చేరిందంతే.