News March 26, 2025
సహకరించకపోతే జైలుకు పోతావని YS సునీత బెదిరించారు: కృష్ణారెడ్డి

వివేకా హత్య కేసుపై ఆయన PA కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దొరికిన లేఖను దాచిపెట్టాలని YS సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ చెప్పారని తెలిపారు. పోలీసులతో సమస్య వస్తుందని చెప్పినా వినలేదన్నారు. ఢిల్లీలో CBI విచారణకు ఆయనే తనకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారని చెప్పారు. సహకరించకపోతే జైలుకు పోతావని సునీత కూడా బెదిరించారని పేర్కొన్నారు. తనను కేసులో ఇరికించి ఇప్పుడు వారు బయట ఉన్నారని దుయ్యబట్టారు.
Similar News
News December 8, 2025
BREAKING: సెలవుల జాబితా విడుదల

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.
News December 8, 2025
ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా తెలుసుకోండి!

సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని ‘UIDAI’ సూచించింది. దీనిద్వారా మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో, ఇంకెవరైనా వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం తొలుత My Aadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘authentication history’ని <


