News June 1, 2024
ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం: ఆరామస్తాన్

ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారం చేపట్టనుందని ఆరామస్తాన్ సర్వే చెబుతోంది. జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో జగన్కు ఓటర్లు తిరిగి పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది.
– మరిన్ని ఎగ్జిట్ పోల్స్ అందరికంటే ముందుగా వే2న్యూస్లో పొందండి.
Similar News
News October 18, 2025
ధన త్రయోదశి: ఉప్పు కొంటున్నారా?

ధన త్రయోదశి నాడు ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంట్లో వాస్తు దోషాలు తొలగి, ఆనందం, శ్రేయస్సు కలగడానికి ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేయాలని పండితులు చెబుతున్నారు. ‘నేడు ఉప్పు కొనడం శుభప్రదం. ఇది సంతోషం, అదృష్టాన్ని తెస్తుంది. లక్ష్మీదేవి తన భక్తులకు తన ఆశీస్సులను కురిపిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉప్పు నీటిని చల్లడం పేదరికాన్ని, దుఃఖాన్ని దూరం చేస్తుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
అఫ్గాన్లు పాక్ నుంచి వెళ్లిపోవాలి: ఖవాజా ఆసిఫ్

అఫ్గానిస్థాన్తో ఘర్షణల నేపథ్యంలో పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ అఫ్గాన్లు దేశం విడిచిపోవాలని సూచించారు. ‘ఈ దేశం, సౌకర్యాలు కేవలం 25 కోట్ల పాక్ పౌరులకే సొంతం. ఇక్కడ ఉంటున్న అఫ్గాన్ పౌరులు తిరిగి మీ దేశానికి వెళ్లిపోవాలి. మీకు ఇప్పుడు ప్రత్యేక ప్రభుత్వం ఉంది’ అని తెలిపారు. అంతకంటే ముందు సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో అవసరమైతే అఫ్గాన్, భారత్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News October 18, 2025
కోడి పిల్లల పెంపకం – బ్రూడింగ్ కీలకం

కోడి పిల్లలు గుడ్డు నుంచి బయటకొచ్చాక కృత్రిమంగా వేడిని అందించడాన్ని “బ్రూడింగ్” అంటారు. వాతావరణ పరిస్థితులను బట్టి బ్రూడింగ్ను 4-6 వారాల పాటు చేపట్టాల్సి ఉంటుంది. అయితే బ్రూడర్ కింద వేడిని కోడి పిల్లల వయసును బట్టి క్రమంగా తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్లిపోతాయి. తక్కువైతే పిల్లలన్నీ మధ్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడం, పెంచడం చేయాలి.