News September 20, 2025

YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పు!

image

తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Similar News

News September 20, 2025

స్వచ్ఛతాహి సేవపై కలెక్టర్ సమన్వయ సమావేశం

image

కలెక్టర్ డీ.కే. బాలాజి శుక్రవారం కలెక్టరేట్‌లోని “మీ-కోసం” సమావేశ హాల్‌లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలను సమన్వయంతో ముమ్మరంగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కే. కన్నమ నాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జే.అరుణ, తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

కృష్ణా: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా నూతన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ న్యాయమూర్తికి మొక్కను అందజేశారు. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలు పరస్పర సహకారంతో ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నేరస్తులకు త్వరితగతిన శిక్ష విధించేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ తెలిపారు.

News September 18, 2025

కృష్ణా: ‘స్వచ్ఛతాహి సేవ’పై సమీక్ష

image

కలెక్టర్ డి.కె. బాలాజి గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు-భవనాల శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం, ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.