News September 19, 2025
YSR మరణంతోనే రాష్ట్ర విభజన: రాజగోపాల్‌రెడ్డి

YSR మరణంతోనే రాష్ట్ర విభజన జరిగిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నా వెనుక ఇంటెలిజెన్స్ ఉందని, నేను పార్టీ మారుతున్నానని, మాజీ CM జగన్‌ను కలుస్తున్నానని కొందరు ప్రచారం చేశారు. నేను రాజకీయ నాయకుడిగా కాకుండా, సోదరుడిగా APకి వచ్చాను. నేను YSR అభిమానినని, ఒక మనిషి మరణిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు’ అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
Similar News
News September 19, 2025
మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

TG: తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు CM రేవంత్ ఆమోదం లభించగానే ఆధునికీకరణ పనులు ప్రారంభించి.. వందరోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.
News September 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 19, 2025
శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.