News October 25, 2024

YSR క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి: CBN

image

AP: తానెప్పుడూ రాజకీయాల్లో కక్షసాధింపునకు పాల్పడలేదని CM చంద్రబాబు అన్నారు. ‘తొలిసారి నేను రూలింగ్‌లో ఉన్నప్పుడు YSR ప్రతిపక్షంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోయినా నేను సంయమనం పాటించేవాడిని. ఆ తర్వాత ఆయన సీఎం అయినప్పుడు దూకుడుగా వ్యవహరించేవాడు. అయినా నేను నిలదొక్కుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దీంతో ఆయన తగ్గి నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి’ అని అన్‌స్టాపబుల్‌లో తెలిపారు.

Similar News

News October 26, 2024

అత్యంత విలువైన సంస్థగా ఎన్‌విడియా

image

ప్రపంచంలోనే విలువైన సంస్థగా ఉన్న యాపిల్‌ను తోసిరాజని NVIDIA ఈరోజు ఆ స్థానాన్ని దక్కించుకుంది. త్వరలో AI సూపర్ కంప్యూటింగ్ చిప్స్ తీసుకురానుందన్న వార్తలతో సంస్థ షేర్ విలువ గణనీయంగా పెరిగింది. ఎన్‌విడియా విలువ 3.53 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, యాపిల్ విలువ 3.52 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించిన అనంతరం NVIDIA విలువ ఈ నెలలో 18శాతం పెరిగింది.

News October 26, 2024

ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా..!

image

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని కింగ్ నాగార్జున ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోను చూసి మెగా, అక్కినేని ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ ఇంకా యవ్వనంలోనే ఉన్నారా అన్నట్లుగా కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు. ఇటీవల విశ్వంభర టీజర్‌లోనూ మెగాస్టార్ పాత సినిమాల్లోని చిరులా ఉన్నారంటూ మెగాఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News October 26, 2024

ABHIMANYU: ఎన్నాళ్లో వేచిన ఉదయం..!

image

ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్‌లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్‌గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి. గతంలో స్టాండ్‌బైగా ఎంపికైనా జట్టులో చోటు దక్కించుకోలేదు.