News July 8, 2024
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని YSR అనేవారు: CM రేవంత్

TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని దివంగత సీఎం YSR అనేవారని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ప్రధాని పదవికి రాహుల్ అడుగుదూరంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. YSR జయంతి సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయనకు నివాళులర్పించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. రాహుల్ను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించేవారే అసలైన YSR వారసులని సీఎం చెప్పుకొచ్చారు.
Similar News
News November 15, 2025
8 దేశాలతో మరో మెగా క్రికెట్ టోర్నీ

మహిళల క్రికెట్కు ప్రచారం కల్పించడం, విస్తరించడమే లక్ష్యంగా ఐసీసీ మరో గ్లోబల్ టోర్నమెంట్ నిర్వహించనుంది. దీనికి ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ అనే పేరు పెట్టింది. తొలి ఎడిషన్ బ్యాంకాక్ వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు జరగనుంది. థాయిలాండ్, నెదర్లాండ్స్, పాపువా న్యూ గినియా, UAE, స్కాట్లాండ్, నమీబియా, టాంజానియా, ఉగాండా దేశాలు పాల్గొంటాయి.
News November 15, 2025
రేపు విజయవాడకు CJI జస్టిస్ గవాయ్

AP: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు విజయవాడకు రానున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేస్తారు. ఈ ప్రోగ్రామ్లో సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్, ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు.
News November 15, 2025
SAతో తొలి టెస్ట్.. భారత్కు మెరుగ్గా విన్నింగ్ ఛాన్స్!

సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో SA 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా 4, కుల్దీప్ 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో సఫారీలు ఉన్నారు. క్రీజులో బవుమా(29), బాష్(1) ఉన్నారు. రేపు మిగతా 3 వికెట్లను త్వరగా కూల్చేస్తే IND గెలుపు నల్లేరుపై నడకే.
* స్కోర్లు: SA.. 159/10, 93/7; భారత్ 189/10


