News February 25, 2025
బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.
Similar News
News December 1, 2025
డిసెంబర్ నెలలో పర్వదినాలు

DEC 1: గీతా జయంతి, సర్వ ఏకాదశి
DEC 2: మత్స్య, వాసుదేవ ద్వాదశి, చక్రతీర్థ ముక్కోటి
DEC 3: హనమద్ర్వతం, DEC 4: దత్త జయంతి
DEC 8: సంకటహర చతుర్థి
DEC 12: కాలభైరవాష్టమి
DEC 14: కొమురవెళ్లి మల్లన్న కళ్యాణం
DEC 15: సర్వ ఏకాదశి
DEC 16: ధనుర్మాసం ప్రారంభం
DEC 30: ముక్కోటి ఏకాదశి
News December 1, 2025
చిరు-వెంకీ సాంగ్.. 500 మంది డాన్సర్లతో షూటింగ్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ నుంచి ఓ అప్డేడ్ చక్కర్లు కొడుతోంది. గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్-విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 500 మంది డాన్సర్లతో ఈ పాటను గ్రాండ్గా చిత్రీకరిస్తున్నట్లు చెప్పాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని 2026 సంక్రాంతి బరిలో నిలపనున్నారు.
News December 1, 2025
విటమిన్-E ఫుడ్స్తో చర్మం, గుండె ఆరోగ్యం పదిలం!

విటమిన్-E ఉండే ఆహార పదార్థాలు చర్మం, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాదం, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, బ్రకోలీ, కివీ, ఆలివ్ నూనె, అవకాడో డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. బాదం, అవకాడో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె పనితీరును మెరుగు పరుస్తాయంటున్నారు. బ్రకోలీ ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తుందని, కివీతో చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు.


