News March 12, 2025
శాసనమండలిలో వైసీపీ నిరసన

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.
Similar News
News March 12, 2025
CM రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్

TG: సీఎం రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి, తేజస్విని అనే మహిళలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి రెండు ల్యాప్‌టాప్స్, ఫోన్లను సీజ్ చేశారు.
News March 12, 2025
ఫేక్ ఎంప్లాయీస్‌తో ₹18కోట్లు కొట్టేసిన HRమేనేజర్

షాంఘైలో లేబర్ సర్వీసెస్ కంపెనీ పేరోల్ HR మేనేజర్ యాంగ్ ఘరానా మోసం ఉలిక్కిపడేలా చేస్తోంది. 22 ఫేక్ ఎంప్లాయీస్ పేరుతో 8 ఏళ్లలో అతడు ₹18కోట్లు కొట్టేశాడు. ఉద్యోగుల నియామకం, శాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడాన్ని గమనించిన అతడు మొదట సన్ పేరుతో ఫేక్ A/C సృష్టించాడు. కంపెనీ జీతం వేయడంతో మిగతా కథ నడిపించాడు. ఒక్క రోజైనా సెలవు పెట్టకుండా జీతం తీసుకుంటున్న సన్ గురించి ఫైనాన్స్ శాఖ ఆరా తీయడంతో మోసం బయటపడింది.
News March 12, 2025
PhonePe చూసి మీరూ షాక్ అయ్యారా?

దేశంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యూపీఐ యాప్ ‘ఫోన్‌పే’ అప్డేట్ అయింది. ఇప్పటి వరకూ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్‌లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ‘ఫోన్ పే’ యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. మీ కామెంట్?