News December 27, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా YCP నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.

Similar News

News November 16, 2025

వాషింగ్ మెషీన్ వాడుతున్నారా?

image

వాషింగ్ మెషీన్ ఉపయోగించడంలో కొన్ని టిప్స్ పాటిస్తే దుస్తులు, మెషీన్ మన్నిక బావుంటుంది. * కాస్త గట్టి వస్తువులు, సున్నితమైన వస్తువుల్ని జిప్‌లాక్‌ ఉన్న మెష్‌ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేయాలి. * క్విక్‌ వాష్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే బట్టల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. * గాఢత తక్కువున్న డిటర్జెంట్‌ వాడాలి. * వేటిని ఉతకాలన్నా వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ బట్టి ఉతకాలి. * దుర్వాసన వస్తుంటే కాస్త వెనిగర్ వేయాలి.

News November 16, 2025

డ్రైవర్ అన్నలూ.. ప్రాణాలు తీయకండి!

image

రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం, ఇతర పనుల వల్ల కొందరు డ్రైవర్లు రోడ్డు పక్కనే బండ్లు ఆపుతారు. కనీసం సిగ్నల్ లైట్లు వేయరు. రేడియం రిఫ్లెక్టర్లు ఉండవు. దీనివల్ల రాత్రి వేళల్లో వెనుక నుంచి వస్తున్న వాహనాలకు అవి కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చలికాలంలో పొగమంచు వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
Share it

News November 16, 2025

RRBలో JE ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

RRB జూనియర్ ఇంజినీర్(JE) పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా.. DEC 10 వరకు పొడిగించింది. 2,569 పోస్టులకు గాను చెన్నై, జమ్మూ, శ్రీనగర్ రీజియన్‌లో 16 పోస్టులు పెంచడంతో 2,585కు చేరాయి. ఇప్పటికే అప్లై చేసుకున్నవారు పోస్టు ప్రాధాన్యత , రైల్వేజోన్ సవరణ ఎలాంటి ఫీజు లేకుండా NOV25 – DEC 10 వరకు చేసుకోవచ్చు.