News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటు?

రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోందని నేషనల్ మీడియా పేర్కొంది. వైసీపీ, బీజేడీ (ఒడిశా) పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ ఎంపీలకు విప్ జారీ చేయకపోవడమే దీనికి నిదర్శనమని తెలిపింది. దీంతో ఏడుగురు వైసీపీ ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని వెల్లడించింది. కాగా బిల్లుకు 95 వ్యతిరేక ఓట్లు పడగా అందులో INDI కూటమి 88, BRS 4, అన్నాడీఎంకేవి 3 ఓట్లు ఉన్నట్లు సమాచారం.
Similar News
News April 10, 2025
ALERT: రెండ్రోజుల పాటు వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. గంటకు 50 కి.మీ వేగం వరకూ ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
News April 10, 2025
ESICలో 558 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్-ఢిల్లీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో MS/MD/MCH/DM/MSC చేసిన వారు అర్హులు. వయసు 45ఏళ్లు మించరాదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రారంభ జీతం సీనియర్ స్కేల్‌కు నెలకు రూ.78,800, జూనియర్ స్కేల్‌కు రూ.67,700 ఉంటుంది.
వెబ్సైట్: https://www.esic.gov.in/
News April 10, 2025
నిత్యాన్నదాన సత్ర భవనానికి టెండర్ నోటిఫికేషన్

TG: వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భవనం సువిశాలంగా ఉండేలా ఎకరంన్నర స్థలంలో, రెండు అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.35కోట్లు మంజూరు చేసింది. 1990 నుంచే నిత్యాన్నదానం ప్రారంభమవ్వగా భక్తులకు పరిమిత సంఖ్యలో భోజన సదుపాయం కల్పిస్తున్నారు.