News May 11, 2024

భారత్ జోడో యాత్రకు వైఎస్సారే స్ఫూర్తి: రాహుల్

image

AP: వైఎస్సార్ తనకు తండ్రిలా మార్గనిర్దేశం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడప సభలో తెలిపారు. ‘రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారు. వైఎస్సార్ ఏపీకే కాదు మొత్తం దేశానికే దారి చూపించారు. నా భారత్ జోడో పాదయాత్రకు ఆయనే స్ఫూర్తి. దేశమంతా పాదయాత్ర చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే నాకు చెప్పారు’ అని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

Similar News

News October 28, 2025

భారీ వర్షాలు.. అన్నదాతలకు సూచనలు

image

భారీ వర్షం సమయంలో నీళ్లను బయటకు పంపాలని పొలానికి వెళ్లొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి వెళ్లండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి తీరం వద్దకు వెళ్లొద్దు. నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ మోటార్లు, స్తంభాలను తాకవద్దు. వాటి దగ్గరకు వెళ్లవద్దు. పిడుగు పడే సమయంలో చెట్లకింద ఉండొద్దు. పిడుగులు పడేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.

News October 28, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

APPSC విడుదల చేసిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్(3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులను అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత డిప్లొమా, BSc, B.Ed, MA, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లైకి రేపు ఆఖరు తేదీ.

News October 28, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై రూ.750 పతనమై రూ.1,12,250గా ఉంది. అటు వెండిపై రూ.5,000 తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.