News June 4, 2024
యూసుఫ్ పఠాన్ విజయం

పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.
Similar News
News January 26, 2026
ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలి: సీఎం

AP: పాలనలో టెక్నాలజీని వినియోగించి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. RTGSపై సమీక్షలో ఆయన మాట్లాడారు. 2026ను టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌గా మార్చాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ AI పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌తో 878 సేవలు అందుతున్నాయని, ఇప్పటివరకు 1.43 కోట్ల మంది వినియోగించుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు.
News January 26, 2026
ఆపరేషన్ సిందూర్.. పాక్ గాలి తీసిన స్విస్ థింక్ ట్యాంక్!

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయమని స్విస్ థింక్ ట్యాంక్ CHPM తేల్చి చెప్పింది. ప్రారంభంలో పాక్ హడావిడి చేసినా తర్వాత ఇండియన్ ఎయిర్ సుపీరియారిటీ ముందు తలవంచక తప్పలేదని పేర్కొంది. ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్‌ను మన వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసి పాక్ ఎయిర్ బేస్‌లను కోలుకోలేని దెబ్బకొట్టిందని తేల్చింది. భయపడి 4 రోజుల్లోనే పాక్ Ceasefire కోరుకున్నట్లు తెలిపింది. భారత్‌ది బలమైన ప్రతీకారమని పేర్కొంది.
News January 26, 2026
రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై వివాదం

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు ఖర్గే, రాహుల్ గాంధీలకు మూడో వరుసలో సీటు కేటాయించడంపై రగడ మొదలైంది. ప్రతిపక్ష నేతకు కేంద్రమంత్రులకు ఇచ్చే గౌరవం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానించిందని INC నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆత్మన్యూనతతో బాధపడుతోందని విమర్శిస్తున్నారు.


