News April 12, 2025
‘యువ వికాసం’ సర్వర్ డౌన్

TG: <<16017360>>రాజీవ్ యువ వికాసం పథకానికి<<>> దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. అయితే 2, 3 రోజులుగా వెబ్‌సైట్ సర్వర్ డౌన్ అవుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్‌పేజీ నిలిచిపోతోంది. దీంతో మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వెబ్‌సైట్: <
Similar News
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>