News September 21, 2024
యువీ ఆ రోజు ఏడు సిక్సులు కొట్టి ఉండేవారు: బ్రాడ్

2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ 6 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు అంపైర్ కారణంగా యువీ ఏడో సిక్స్ మిస్ అయిందని బ్రాడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ ఓవర్ రీప్లే నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఓ నోబాల్ వేసినా తప్పించుకున్నాను. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 29, 2025
విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్ఫార్మర్ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్తో పాటు అక్కడి 25KV ట్రాన్స్ఫార్మర్నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
News October 29, 2025
మళ్లీ యుద్ధం.. గాజాపై భీకర దాడులకు ఆదేశం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. గాజాపై పవర్ఫుల్ స్ట్రైక్స్ చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మిలిటరీని ఆదేశించారు. హమాస్ పీస్ డీల్ను ఉల్లంఘించిందని, ఇజ్రాయెలీ బందీల మృతదేహాలు, అవశేషాలను ఇంకా అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో తమ బలగాలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. దీంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News October 29, 2025
ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


